Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మానవ వనరుల శాఖ-ఢిల్లీ ఐఐటీ మధ్య మరోసారి వివాదం

ఒక పార్ట్ టైం పీహెచ్ డీ విద్యార్థిని అడ్మిషన్ రద్దు విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్ డీ), ఢిల్లీ ఐఐటీ సెనేట్ మధ్య వివాదం తలెత్తింది. అలీషా తంగ్రీ అనే విద్యార్థిని తన ఉద్యోగ అనుభవం గురించిన వాస్తవాలు దాచిపెట్టిన నేపథ్యంలో ఆమె పీహెచ్ డీ అడ్మిషన్ ను ఢిల్లీ ఐఐటీ రద్దు చేసింది. దాంతో ఆమె తరపున తండ్రి అలీషా ప్రధానమంత్రి కార్యాలయానికి పిటిషన్ పెట్టుకున్నారు. స్పందించిన పీఎంవో ఈ అంశాన్ని హెచ్ఆర్ డీకి నివేదించి సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ పిటిషన్ పరిష్కరించాలని కోరుతూ హెచ్ఆర్ డీ ఢిల్లీ ఐఐటీ సెనేట్ కు లేఖ పంపింది. విద్యార్థిని అడ్మిషన్ రద్దుపై పునరాలోచన చేయాలని కోరింది. దాన్ని సెనేట్ నిర్మొహమాటంగా తోసిపుచ్చింది. విద్యార్థిని పిటిషన్ ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి లేదా ఐఐటీ డైరెక్టర్ కు నివేదించాలని తెలిపింది. అయితే ఈ విషయంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ జోక్యాన్ని సెనేట్ నిరసిస్తోంది. తమ అకడమిక్ వ్యవహారాలలో తలదూర్చవద్దని, హెచ్ఆర్ డీ తీరు మారకుంటే రాజీనామా చేస్తామని ముగ్గురు డీన్లు హెచ్చరిస్తున్నారు.

More Telugu News